ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రానిస్తుంది . ఇక ఇంతకీ ఆమె ఎవరంటే .. ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ . గతంలో తెలుగు చిత్ర పరిశ్రమ లో స్టార్ హీరోయిన్ .. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించింది .. ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో తనదైన నటనతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ క్రెజ్ తెచ్చుకుంది. అలాగే సౌత్ చిత్ర పరిశ్రమ లోనే తిరుగులేని స్టార్డం అందుకుంది ..
13 ఏళ్ల వయసు లోనే నటిగా సిని ప్రయాణం మొదలు పెట్టింది. వెల్లై మనసు సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇక 1990 నుంచి 2000 వరకు దాదాపు పదేళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది. సౌత్ లో ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలకు అమ్మగా నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా కొనసాగుతుంది రమ్యకృష్ణ .