ఇక గత కొన్నాళ్లుగా రాజమౌళి ఏదైనా సినిమా మొదలుపెట్టేముందు ప్రెస్మీట్ పెట్టి అన్ని వివరాలు ప్రకటించడం మనం చూస్తున్నాం. స్టోరీ లైన్ రివిల్ చేసి ఆడియన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచడం రాజమౌళి అలవాటు .. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో అలాంటివి ఉండవని టాక్ వినిపిస్తుంది .. త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నట్లు రాజమౌళి స్వయంగా చెప్పినా మేకర్స్ సైడ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రవటన రాలేదు .. ఇక ఇప్పుడు లాంఛనంగా సినిమాని ప్రారంభించిన రాజమౌళి ప్రెస్ మీట్ ఉండదని అంటున్నారు. ఇక మరోపక్క మహేష్ బాబు తన సినిమాల ఓపెనింగ్ ఈవెంట్స్ మహేష్ వెళ్లరు అనే విషయం తెలిసిందే .. అలాగే తన సెంటిమెంట్ గా తన భార్య నమ్రత , పిల్లలు సితార లేదా గౌతమ్ లు మాత్రమే తన సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నారు. ఇక ఎప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతారా ? లేదా సెంటిమెంట్ ను బ్రేక్ చేసి పూజ కార్యక్రమానికి మహేష్ వస్తారా ? లేదా ఇప్పట్లాగే మహేష్ తన భార్య పిల్లలను ఈవెంట్ కి పంపిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
SSMB 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో హై వోల్డ్జ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది .. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన గ్లోబల్ ప్రశంసలను దృష్టిలో పెట్టుకొని హాలీవుడ్ స్టైల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రపంచ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో భాగం కానున్నారు. మహేష్ కు జంట గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది. ఎప్పటిలాగే రాజమౌళి తండ్రి విజయేందర్ ప్రసాద్ ఈ సినిమాకి కథ అందించారు .. అలాగే ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు . దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు .. 1000 కోట్లకు పైగా ఈ సినిమా కోసం బడ్జెట్‌ను అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రాజమౌళి మహేష్ కెరియర్ లోనే భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని కూడా అంటున్నారు. ఇటు మరి త్వరలోనే ఈ భారీ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన అధికార వివరాలను కూడా వెల్లడిస్తారేమో చూడాలి.