'బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు దూరం ఉంటున్నారు?' అనే ప్రశ్నకు ఆమె.. 'తమిళనాడు బీజేపీ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు నేను ఒకదానిని ఉన్నాననే విషయం వారికి గుర్తుందో లేదో నాకు అర్ధం కావడం లేదు. ఇది నన్ను చాలా బాధిస్తోంది.' అని పేర్కొన్నారు. ఆ ఆడియోను సదరు సంస్థ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంతో కలకలం రేగింది. దాంతో ఆమె వాయిస్ కాల్‌ను బీజేపీ అధి నాయకత్వం తప్పుబట్టడంతో ఈ విషయం ఖుష్బూకు తెలిసింది. దాంతో సదరు మీడియా సంస్థ తన నుంచి అనుమతి లేకుండా ఎలా విడుదల చేస్తారని ఆమె మండిపడ్డారు. అనంతరం ఆ ఫోన్ కాల్‌లో తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని చెబుతూ తమిళనాడు బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు.
ఇక ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ... "ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేశాను. అయితే కొన్ని సినిమాల్లో అనవసరంగా నటించానే బాధ ఇప్పటికే ఉంటుంది. నేను బాలీవుడ్ సినిమాల కన్నా సౌత్ సినిమాలోనే ఎక్కువ నటించాను. బాలీవుడ్లో నేను చేసిన సినిమాల గురించి ఎప్పుడూ బాధపడలేదు. కానీ, సౌత్ లో నేను నటించిన కొన్ని సినిమాల్లో ఎందుకు నటించాను అని బాధ పడిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు రజనీకాంత్ తో నేను ఒక సినిమా చేశాను. అందులో నేను, మీనా హీరోయిన్స్ గా నటించాము. మాకు మొదట కథ చెప్పినప్పుడు మా ఇద్దరి పాత్రలు చాలా కీలకమని చెప్పుకొచ్చారు. దాంతో పాత్ర బాగా నచ్చడంతో నేను వెంటనే ఓకే చేశాను. కానీ ఆ తరువాత ఆ పాత్రలోకి హీరోయిన్ నయనతారను సడెన్ గా తీసుకున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు." అంటూ చెప్పుకొచ్చింది.