తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తమిళ దర్శకుడు అయినా కూడా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అనేక భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈయనకు దర్శకుడిగా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి కూడా ఆ స్థాయి విజయాలను అందుకోలేదు.

శంకర్ తాజాగా భారతీయుడు 2 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా ప్లాప్ తో శంకర్ క్రేజ్ చాలా వరకు పడిపోయింది. ఇది ఇలా ఉంటే శంకర్ తాజాగా రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ లో చాలా మార్పు వచ్చినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకు అంటే శంకర్ సినిమాలలో  దాదాపు ఇంట్రో సాంగ్స్ ఉండవు. కానీ గేమ్ చేంజర్ సినిమాలో ఓ ఇంట్రో సాంగ్ ఉంది. అలాగే శంకర్ సినిమాలు దాదాపు మూడు గంటల నిడివి అంతకు మించిన నిడివితో ఉంటాయి. గేమ్ చేంజర్ సినిమా కేవలం 2 గంటల 45 నిమిషాలతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా శంకర్ తన పూర్వపు సినిమాలతో పోలిస్తే గేమ్ చేంజర్ సినిమా విషయంలో అనేక మార్పులు చేసినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: