ఇక నాగచైతన్య సమంత కాంబినేషన్లో ఏ మాయ చేసావే , మనం , ఆటోనగర్ సూర్య వంటి సినిమాలు వచ్చాయి .. అలాగే మజిలీ సినిమా నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత ఇద్దరు పోటీపడి నటించారు. ఈ సినిమాల్లో వీరి నటనకు మంచి మర్కుటు పడ్డాయి. కథ ప్రకారం ఆ పాత్రలో మంచి డెప్త్ ఉంది .. ఈ సినిమాలో వీరిద్దరితో పాటు దివ్యాన్ష కౌశిక్ కూడా నటించింది. ఇక మజిలీలో ఈమెని నాగాచైతన్య ముందుగా ప్రేమిస్తాడు మరోవైపు సమంత నాగచైతన్యాన్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఇక దివ్యాన్ష కౌశిక్ కు ముందు ఆ పాత్రలో దర్శకుడు శివ నిర్మాణ శోభిత ధూళిపాలను తీసుకోవాలని భావించారు.. అలాగే ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు .. కానీ అనుకోని కారణాలవల్ల ఆ పాత్రకు శోభిత దూరమైంది.
ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో శోభితకు నాగచైతన్యకు పరిచయం ఏర్పడింది. ఇక దర్శకుడు దివ్యాన్ష కౌశిక్ ను తీసుకున్న తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం అందుకుంది. ఇక సమంతతో విడిపోయిన కొన్నాళ్లకు నాగచైతన్యా శోభిత ధూళిపాలను ప్రేమించాడు. అలాగే ఎవరు ఊహించిన విధంగా నాగార్జున ఇంట్లో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలో కేవలం 300 మంది అతిథుల మధ్య ఎంతో సింపుల్గా చేశారు. నాగచైతన్య కోరిక మేరకే ఇంత సింపుల్గా చేయాల్సి వచ్చిందని నాగార్జున అంటున్నారు. అలాగే నాగ్ మరో కొడుకు అఖిల్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇలా అక్కినేని కుటుంబంలో వరుసగా పెళ్లి భాజలు మోగుతున్నాయి.