టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఇంద్ర సినిమా కూడా ఒకటి. బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఈ సినిమలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీది తెనాలి మాది తెనాలి అంటూ ఏవీఎస్ చేసిన కామెడీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
 
ఈరోజు ఏవీఎస్ పుట్టినరోజు కాగా అప్పట్లో ఏవీఎస్ పుట్టినరోజునే ఈ సీరియల్ ను షూట్ చేయడం గమనార్హం. ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం కాగా తెరపై కామెడీ వర్కౌట్ కావడానికి తెర వెనుక ఆయన ఎంతో కష్టపడేవారు. ఇంద్రలోని మీది తెనాలి మాది తెనాలి సీన్ ను రూపొందించిన వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. ఇంద్ర సినిమా సక్సెస్ లో ఏవీఎస్ కామెడీ కీలక పాత్ర పోషించింది.
 
ఈ సినిమాలో బచ్చు పెద్దపిచ్చయ్యగా ఆయన నటించారు. మొదట మీది తెనాలి సంభాషణ స్క్రిప్ట్ లో లేదు. మొదట అశ్వనీదత్ ఆ సీన్ కు ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరించారు. ఒకానొక సమయంలో ఏవీఎస్ తానా సభలకు వెళ్లగా అక్కడ మీది తెనాలి మాది తెనాలి అంటూ ఏవీఎస్ ను ఇన్వైట్ చేశారు. ఈ విధంగా ఇన్వైట్ చేయడం ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
 
కాలేజ్ రోజుల్లో ఏవీఎస్ రంగస్థల నాటకాలను ప్రదర్శించడం ద్వారా మంచ్ గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం. బాపు డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ పెళ్లాం సినిమా ఆయనకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. వెండితెరపై ఏకంగా 500కు పైగా సినిమాలలో ఆయన నటించారు. పలు సినిమాలను నిర్మించిన ఆయన నిర్మాతగా మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ఇంద్ర సినిమాకు ఈ జనరేషన్ లో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: