స్వేచ్ఛగా బతకాలని... టాలీవుడ్ ఇండస్ట్రీని మరింత డెవలప్ చేసుకోవాలని సూచనలతో ముందుకు వెళ్లింది రేవంత్ రెడ్డి సర్కార్. అంతేకాదు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవాలని కూడా సూచించింది. అయితే అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమాకు కూడా ఫుల్ పవర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ సంధ్య థియేటర్ ఘట్టన ఎవరు అనుకోకుండా జరిగింది. దీంతో అల్లు అర్జున్ పెను ప్రమాదంలోకి నెట్టి వేయబడ్డాడు.
అయితే ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వచ్చి టాలీవుడ్ పెద్దలు.. కలవడం జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కీలక విషయాలను రేవంత్ రెడ్డితో చర్చించారు. అయితే... తెలంగాణలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయిందని... దానికి బానిసలు అయిపోయారని రేవంత్ రెడ్డి వాళ్లతో చర్చించారట. అయితే తెలంగాణను కాపాడుకునేందుకు డ్రగ్స్ ను అరికట్టాలని... దానికోసం సాయం అడిగారట రేవంత్ రెడ్డి.
సోషల్ మీడియాలో అలాగే.. ప్రతి సినిమాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని.. రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో ప్రతి ఒక్క తెలుగు హీరో.... ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియోలు చిత్రీకరించి పోస్టు చేస్తున్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని హీరోలు కోరుతున్నారు. అలాగే తప్పుడు వార్తలు, సోషల్ మీడియాలో కథనాలు... నమ్మకూడదని కూడా సూచిస్తున్నారు హీరోలు. ఇలా తన దారికి టాలీవుడ్ ఇండస్ట్రీ ని తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి.