"ఇకపై సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించాలి అంటే ఆ పని చేయాల్సిందే"..సినీమండలి కొత్త రూల్..!? ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ ల పేరుతో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము.  సినిమా ప్రమోట్ చేసుకునేందుకు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. కొందరు సోషల్ మీడియా వేదికగా వాళ్ల సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటే .. మరి కొందరు మాత్రం రియాల్టీ షోస్ కి హాజరవుతూ పలువులు స్టార్ సెలబ్రెటీస్ చేత తమ సినిమాకి పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటూ ఉంటారు.  అయితే పాన్ ఇండియా స్టార్స్ ఆ రేంజ్ హీరోలు మాత్రం పలు స్టేట్స్ లో ఈవెంట్ ల పేరిట ఫంక్షన్స్ నిర్వహిస్తూ హంగామా చేస్తూ ఉంటారు.


కొన్ని కొన్ని సార్లు అలాంటి ఫంక్షన్స్ లో అపశృతిలు కూడా జరుగుతూ ఉంటాయి . రీసెంట్గా పుష్ప2 విషయంలో అల్లు అర్జున్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటున్నాడో అందరికీ తెలుసు . అయితే ఇకపై అల్లు అర్జున్ లా ఎవరు బాధపడకూడదు అంటూ సినీమండలి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందట.  ఇకపై ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహించాలి అన్నా సరే ముందుగా ఆ సినిమా డైరెక్టర్ ..ప్రొడ్యూసర్ .. హీరో ముందుగా సినీ మండలకి వచ్చి ఎక్కడ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు..?  అనే విషయాన్ని సబ్మిట్ చేసి సరైన సమాచారం ఇవ్వాలట.



మీరు ఈవెంట్ నిర్వహించే విషయం పోలీసులకు తెలుసా..? ఇన్ ఫర్ మేషన్ ఇచ్చారా..? పోలీసులు పక్కా సెక్యూరిటీ ఇవ్వడానికి అంగీకారం తెలిపారా..? ఆ డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేశాకే ఎక్కడైనా సరే ఈవెంట్ నిర్వహించుకునే విధంగా కొత్త రూల్ తీసుకువస్తున్నారట. దీంతో ఫ్యాన్స్ చేసే అతి ఓవరాక్షన్ నుంచి సామాన్య జనాలు బయటపడవచ్చు అని .. అదేవిధంగా స్టార్ సెలబ్రిటీస్ తమ  పేరుని ట్రోల్లింగ్ కాకుండా కాపాడుకోవచ్చు అంటూ భావిస్తున్నారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేయబోతున్నారట . సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: