మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం శూన్య మాసం కాగా శూన్యమాసంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ పూజ జరగడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ముహూర్తాలను నమ్మనని రాజమౌళి ప్రూవ్ చేస్తున్నారా? అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
మహేష్ రాజమౌళి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా జక్కన్న సినిమా అంటే హీరో పడే కష్టం మామూలుగా ఉండదు. చిన్న షాట్ విషయంలో సైతం రాజమౌళి రాజీ పడరు. కొన్నిసార్లు జక్కన్న సినిమాలలో హీరోలు చేసిన సీన్ నే మళ్లీ చేస్తూ ఉండాలి. డ్యాన్స్ స్టెప్స్ ఏ మాత్రం మ్యాచ్ కాకపోయినా ఈ స్టార్ డైరెక్టర్ అస్సలు అంగీకరించరు. పర్ఫెక్షన్ కు పెద్దపీట వేయడమే ఈ దర్శకుని సీక్రెట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే రాజమౌళి పలు సందర్భాల్లో తాను నాస్తికుడినని చెప్పుకొచ్చారు. ముహూర్తాలను నమ్మకపోవడం జక్కన్న సక్సెస్ సీక్రెట్ కావచ్చనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తే ముహూర్తాలు సినిమాల ఫలితాలను మార్చలేవని రాజమౌళి బలంగా విశ్వసిస్తారని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి భిన్నమైన ప్రాజెక్ట్ లకు ఓటేస్తూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
 
అయితే రాజమౌళి మహేష్ కాంబో మూవీ అనధికారికంగా ఎప్పుడో జరిగిపోయిందని అధికారికంగా పూజ చేయాలని ఇప్పుడు పూజ చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి జక్కన్న వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మహేష్ జక్కన్న కాంబో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. హీరోయిన్ ఎంపిక విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహెష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: