నందమూరి బాలకృష్ణ గోల్డెన్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఓ పక్క ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లు గా నిలుస్తుంటే మరోపక్క ఆయన హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో అదిరిపోతుంది. ఏది ఏమైనా బాలయ్య ఫాం చూస్తే మిగతా స్టార్ హీరోలకు నిద్ర కూడా పట్టలేనట్టుగా ఉంది. ఇక రాబోతున్న డాకు మహారాజ్ అప్డేట్స్ తో బాలయ్య అదరగొట్టేస్తున్నారు. బాలకృష్ణ సినిమా అంటే ఒకప్పుడు మూస పద్ధతిలో ఉండేవి. ఆయనకున్న మాస్ స్టామినా ఎవరు సరైన రూట్ లో వాడట్లేదు అనుకునే వారు.

కానీ బోయపాటి ఆ అటెంప్ట్ చేశాడు. బాలకృష్ణకు సిం హా నుంచి ఆయన సినిమాల లెక్క మార్చాడు. అప్పటి నుంచి బాలయ్య తన ఫాం కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ సినిమా అంటే రిజల్ట్ హిట్టేగా అనేలా టాక్ వచ్చేసింది. అంతేకాదు అన్ స్టాపబుల్ చూసిన తర్వాత బాలయ్య ఎంత మంచి మనసు కలవాడు అన్నది అర్ధమైంది.

అందుకే ఆయన సినిమాల్ను మరింత ఆదరిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. డాకు మహారాజ్ గా వస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమాగా వస్తుంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంతికి సత్తా చాటేందుకు వస్తున్న బాలయ్యకు ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అందిస్తుందని అంటున్నారు. మరి బాలకృష్ణ మార్క్ సూపర్ హిట్ డాకు మహారాజ్ కొడుతుందా అన్నది చూడాలి. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు కాబట్టి నెస్క్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటించారు. ప్రగ్యా జైశ్వాల్ కూడా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి చరణ్, వెంకటేష్ సినిమాలకు పోటీగా డాకు మహారాజ్ వస్తుంది. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: