నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి వ్యవహారం మీడియాలో ఎప్పుడు ప్రత్యేకమైన టాపిక్ అని తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోతో రష్మిక లవ్ స్టోరీ తెలిసినా కూడా అఫీషియల్ గా వాళ్లు కన్ఫర్మ్ చేయనిదే బయటకు చెప్పడం కష్టం. ఈ క్రమంలో రష్మిక పెళ్లిపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పేస్తున్నారు. లేటెస్ట్ గా అన్ స్టాపబుల్ షోకి వచ్చిన నాగ వంశీ అయితే తెలుగు హీరోతోనే రష్మిక పెళ్లి అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మళ్లీ ఆ హీరో ఎవరన్నది మాత్రం నాకు తెలియదని తప్పించుకున్నాడు.

హీరో ఎవరన్నది ఆయన చెప్పక పోయినా ప్రేక్షకులకు తెలుసు. సో రష్మిక మందన్న పెళ్లి ఫిక్స్ అయినట్టే అని దాదాపు అందరు చెప్పుకుంటున్నారు. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ వాళ్లిద్దరు డైరెక్ట్ గా చెప్పకపోయినా అందరికీ అర్ధమవుతుంది. ఇక ఈమధ్య ఈ వ్యవహారంపై మరింత ఫోకస్ ఏర్పడుతుంది అంటే ఇద్దరికి పెళ్లి టైం దగ్గర పడినట్టే అనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఈమధ్యనే ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఐతే ఇద్దరు ఏదో ఒకరోజు ఎంగేజ్మెంట్ తో సర్ ప్రైజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. మరోపక్క వాళ్లు కమిటైన సినిమాలన్నీ కూడా పూర్తి చేసి విజయ్, రష్మిక ఈ ఇయర్ దాదాపు ఒకటయ్యే ఛాన్సులు ఉన్నాయని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది అన్నది నిజమని చెప్పొచ్చు. రష్మిక పెళ్లి ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా రష్మిక సినిమాలను మాత్రం ఆపే ఛాన్స్ లేదనిపిస్తుంది. విజయ్ కూడా ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తాడని చెప్పొచ్చు. మరి వీళ్లిద్దరి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: