కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూప ర్ స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ ఈమేజ్ కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు . ఇకపోతే ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడం తో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన సినిమాలు విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి.

కానీ అందులో ఏ సినిమా కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావడం లేదు.  అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లీ , విడ మూయర్చి అనే సినిమాలలో హీరో గా నటిస్తున్నాడు. మొదటగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో అజిత్ కుమార్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అని ఆయన అభిమానులు గట్టిగా నమ్మారు. కొంత కాలం క్రితం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత విడ ముయర్చి సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ సినిమా అయిన సంక్రాంతి బరిలో ఉంది అని అజిత్ అభిమానులు భావించారు. ఇక చివరి నిమిషంలో ఈ సినిమాను కూడా సంక్రాంతి బడి నుండి తప్పిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో అజిత్ అభిమానులు ప్రస్తుతం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: