టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో చరణ్ కి జోడిగా నటించగా అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.

మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు చాలా సినిమాలు పోటీగా రానున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈ మూవీ కి పోటీగా డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇక తమిళ సినిమా పరిశ్రమ నుండి కూడా ఈ మూవీ కి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. జనవరి 10 వ తేదీన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా రూపొందిన విడ మియర్చి సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను తాజాగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో గేమ్ చేంజర్ కు చాలా కలిసి వస్తుంది అని చాలా మంది భావించారు.

కానీ అజిత్ కుమార్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో ఏకంగా ఆరు తమిళ చిన్న సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వనంగన్ , కాదలిక్కు నేరమిల్లై , టెన్ అవర్స్ , పదవి తలైవన్ , మద్రాస్ కారన్ , తరుణం అనే సినిమాలను సంక్రాంతి పండక్కు విడుదల కావడానికి రెడీ అయ్యాయి. ఇలా ఒక సినిమా పోయి గేమ్ చేంజర్ మూవీకి ఏకంగా 6 సినిమాలు తమిళ ఇండస్ట్రీ లో పోటీ అయ్యాయి. దీనితో గేమ్ చేంజర్ కు భారీ దెబ్బ తగిలి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: