ఇక అసలు విషయంలోకి వెళితే ఈ వర్మ తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తనదైన రీతిలో మరోవారు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాకి మేతగా మారాడు. విషయం ఏమిటంటే... ప్రస్తుతం సినిమాలు లేని వర్మ నేను సూసైడ్ చేసుకుని చనిపోతా! అంటూ కామెడీ చేసాడు. అవును, జీవితం అంటేనే ఎంజాయ్మెంట్.. ఆ రోజు వస్తే మాత్రం నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతిలో ఏపనీ లేక, మంచం నుంచి లేవలేని పరిస్థితులు వచ్చినపుడు, ఒకరిపైన ఆధారపడి జీవించాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని పేర్కొన్నాడు. దాంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి.
ఇంకో విషయం ఏమిటంటే? కొత్త సంవత్సరానికి అందరూ స్వాగతం పలికారు. ఈ క్రమంలో 2025లో తాను ఈ పనులు చేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వర్మ ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం నేను 7 తీర్మానాలు తీసుకున్నాను అని మొదలు పెట్టిన వర్మ ఇలా రాసుకొచ్చాడు. ఇక నుంచి వివాదరహితుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని, రెండవది నేను కూడా ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ కావాలని నిశ్చయించుకున్నాను అని, మూడవది దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఉంటాను అని, ఏటా 10 సత్య లాంటి సినిమాలు తెరకెక్కిస్తాను అని, ఎవరి గురించి నెగిటివ్ ట్వీట్స్ పెట్టను, కామెంట్స్ చేయను, ఆడవారి వైపు అస్సలే చూడను, వోడ్కా తాగడం మానేస్తాను.. అంటూ కొసమెరుపుగా మీ అందరి మీద ఒట్టేస్తున్నాను.. ఒక్కనా మీదా తప్ప! అని తనదైన శైలిలో ట్విస్ట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.