మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ నాలుగు పాటలను , ఒక టీజర్ ను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే ఈ రోజు సాయంత్రం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ ట్రైలర్ ముందు భారీ సవాళ్లు కూడా ఉన్నాయి. మరి ఈ మూవీ కొన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని మెగా అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.  విడుదల అయిన 24 గంటల్లో పుష్ప పార్ట్ 2 మూవీ ట్రైలర్ కు 44.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు విడుదల అయిన తెలుగు సినిమా ట్రైలర్ లలో 24 గంటలు అత్యధిక వ్యూస్ ను సాధించిన ట్రైలర్ లలో ఈ మూవీ ట్రైలర్ మొదటి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత గుంటూరు కారం మూవీ ట్రైలర్ 37.68 మిలియన్ వ్యూస్ ను 24 గంటల్లో సాధించి రెండవ స్థానంలో కొనసాగుతుంది. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ కచ్చితంగా ఈ రెండు రికార్డు లలో ఒక్క దానినైనా బద్దలు కొడుతుంది అని మెగా ఫాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరి గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , ఏ రేంజ్ వ్యూస్ ను 24 గంటల్లో దక్కించుకొని ఏ స్థానంలో నిలుస్తుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: