ఇక అసలు విషయంలోకి వెళితే... విజయ్ వర్మ తనకున్న అనారోగ్య సమస్యను బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను అరుదైన చర్మ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు, మేకప్ కాస్మోటిక్స్ తో దీనికి కవర్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా మాట్లాడిన విజయ్ వర్మ తాను విటిలిగో (బొల్లి) అనే చర్మ సమస్యతో బాధపడుతున్న విషయం చెప్పుకొచ్చాడు. దాని వల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, వాటిని దాచడానికి మేకప్ కాస్మోటిక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని, అది చాలా సమస్యగా ఉందని వెల్లడించాడు.
దీని గురించి మొదట్లో చాలా భయపడ్డానని, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసాను అని విజయ్ తెలిపాడు. కాగా బొల్లిని వైట్ స్పాట్ డిసీజ్ అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఈ అరుదైన వ్యాధి శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. చర్మం రంగు మారి తెల్లటి పాచెస్ ఏర్పడుతుంది. వైద్యుల ప్రకారం శరీరంలో మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్ కణాల స్థాయి క్షీణించినపుడు చర్మంపై ఈరకమైన తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అని కూడా అంటారు. అయితే ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు. అయితే బొల్లికి ఇంకా ఖచ్చితమైన నివారణ లేదు. ఉన్న కొన్ని చికిత్సలు మాత్రమే దాని వ్యాప్తిని ఆపుతాయి. బొల్లి వ్యాధికి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు మందులు, క్రీములతో చికిత్స చేయవచ్చు. దీని కోసం లేజర్ థెరపీని కూడా ఉపయోగిస్తారు.