సౌత్ సినిమాల్లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఆమె కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సాధారణంగా నటీమణులు పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. వరలక్ష్మీ శరత్ కుమార్ మాత్రం ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గారని సమాచారం.
సాధారణంగా బరువు తగ్గాలంటే సులువేన విషయం కాదు. 30 కిలోల బరువు తగ్గాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మాత్రం సులువుగానే బరువు తగ్గారని తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించారు. వ్యాయామాలు చేయడం ద్వారా తాను బరువు తగ్గానని వరలక్ష్మీ శరత్ కుమార్ చెబుతుండటం గమనార్హం.
మన పనులు మనమే చేసుకోవడం వ్యాయామం అని ఈ బ్యూటీ చెబుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ తర్వాత సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. వరలక్ష్మి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. వరలక్ష్మీ శరత్ కుమార్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.