మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు చిన్ని కృష్ణ కథను అందించగా , వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను మొదటగా బి గోపాల్ , చిరంజీవితో అస్సలు చేయనున్నాడట. కానీ ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ ఒప్పించడంతో సినిమా చేశాడట. ఒకానొక సందర్భంలో భాగంగా పరుచూరి గోపాలకృష్ణ "ఇంద్ర" మూవీ సెట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాల గురించి చెప్పుకొచ్చాడు.

పరుచూరి గోపాలకృష్ణ ఒకానొక సందర్భంలో భాగంగా మాట్లాడుతూ ... అశ్విని దత్ ... చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో మూవీ సెట్ చేశాడు. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథ ఉంది దానిని వినండి. నచ్చితే చిరంజీవితో సినిమా చేద్దాం అని బి గోపాల్ కి అశ్విని దత్ చెప్పాడు. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథను గోపాల్ విన్నాడు. కానీ అది ఆయనకు నచ్చలేదు. దానితో ఆ కథతో సినిమా చేయను అన్నాడు. ఇక ఒక.రోజు నాకు బి గోపాల్ నాకు కనిపించాడు. నేను ఎందుకు నువ్వు ఆ కథతో చిరంజీవితో సినిమా చేయను అన్నావు అని అడిగాను. దానితో ఆయన నేను ఇప్పటికే బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథ కూడా ప్యాక్షన్ నేపథ్యంలో ఉంది. ఇప్పటికే నేను చిరంజీవి గారితో మెకానిక్ అల్లుడు అనే సినిమా చేశాను. అది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. మరోసారి చిరంజీవితో సినిమా చేస్తే అలాంటి రిజల్ట్ వస్తే నేను తట్టుకోలేను అన్నాడు.

ఇక నేను ... నువ్వు బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమాలు చేశావు ... చిరంజీవితో కాదు. చిరంజీవితో ఫ్యాక్షన్ సినిమా చెయ్యి బ్లాక్ బాస్టర్ అవుతుంది అని కన్విన్స్ చేశాను. ఆయన కూడా ఆ మాటలకు కన్విన్స్ అయ్యి చిన్న కృష్ణ దగ్గర ఉన్న కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఇంద్ర మూవీ గా రూపొందించాడు. అది టాలీవుడ్ ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అని పరుచూరి గోపాలకృష్ణ ఒకానొక సందర్భంలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: