తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత మిరపకాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

సినిమా కంటే ముందు పవన్ కి చాలా ఫ్లాప్ లు ఉన్నాయి. ఈ మూవీ తో ఆయన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే గబ్బర్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టారు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఆ గ్యాప్ లో హరీష్ శంకర్ , రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ హిందీ సినిమా అయినటువంటి రైడ్ మూవీ కి అధికారిక రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ అపజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ "తేరి" అనే మూవీ కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని రూపొందిస్తున్నాడు అని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ అవన్నీ అవాస్తవం కొత్త కథతోనే పవన్ తో సినిమా చేస్తున్నాం అని చెప్పాడు. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ కావడంతో హరీష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా కథలో అనేక మార్పులు చేస్తున్నట్లు కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: