మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో  రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ తో దేశ వ్యాప్తంగా చరణ్ కు భారీగా క్రేజ్ వచ్చింది. ఇక ఆ క్రేజ్ ను అలానే కంటీన్యూ చేస్తూ.. పాన్ ఇండియా దర్శకుడు   శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ ను భారీ ఎత్తున రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు టీమ్. ఇక ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాస్త లేట్ అయినా.. ప్రమోషన్స్ ను మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ దానికి ఒక లెక్క ప్రకారం సెట్ చేసే విధంగా అన్ని భాషల్లో అందరు ప్రముఖులను రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ కు సబంధించిన ప్రమోషన్లు షురు అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.  సంక్రాంతి కానుకగా జనవరి 10 న తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ప్రతీ భాషలో ఈసినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు టీమ్. అందులో భాగంగా రీసెంట్ గా టీజర్ ను లక్నోలోభారీ ఈవెంట్ పెట్టి  రిలీజ్ చేశారు. భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చి ఈ ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ఆడిటోరియం అదరిపోయేలా హడావిడి చేశారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే రేపు ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి రాబోతున్నాడు. ఈ ట్రైలర్ తో సినిమా రేంజ్ ఏమిటో అందరికీ అర్థం అవుతుందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు మొన్న విజయవాడ లో జరిగిన కటౌట్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఈ ట్రైలర్ మీదనే ఓవర్సీస్ మొదటి రోజు ఓపెనింగ్స్ ఆధారపడింది.

అయితే అన్ని భాషలకు సంబంధించిన ట్రైలర్స్ రేపే విడుదలయ్యే అవకాశాలు లేవు. కేవలం తెలుగు వెర్షన్ ట్రైలర్ మాత్రమే రాబోతుంది. తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ ని దిల్ రాజు ఆహ్వానించాడని, అందుకు విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అదే విధంగా హిందీ లో కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసాడు దిల్ రాజు. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ కి షారుఖ్ ఖాన్ మొదటి నుండి మంచి స్నేహితుడు. ఆయన పిలిచిన వెంటనే షారుఖ్ ఖాన్ఈవెంట్ కి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అదే విధంగా కన్నడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కేజీఎఫ్ హీరో, రాకింగ్ స్టార్ యాష్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట. ఇలా అన్ని భాషల్లోనూ సూపర్ స్టార్స్ చేత ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసాడు దిల్ రాజు. ఇన్ని రోజులు ప్రొమోషన్స్ సరిగా చేయడం లేదంటూ నిర్మాత దిల్ రాజు పై రామ్ చరణ్ అభిమానులు ఏ రేంజ్ లో విరుచుకు పడ్డారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లానింగ్ ని చూసి వాళ్లకి ఆనందంతో నోటి నుండి మాట రావడం లేదు. ఇది ఇలా ఉండగా నాల్గవ తేదీన రాజమండ్రి లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: