కమెడియన్ ఫిష్ వెంకట్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో సినిమాలలో హాస్యనటుడు, ప్రధాన పాత్రలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా గత కొంత కాలం నుంచి ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ తాజాగా ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఫిష్ వెంకట్ తెలుగు సినీ నటుడు, ఎక్కువగా హాస్య ప్రధాన సహాయ పాత్రలు పోషిస్తూ ఉంటాడు.


ఇతని అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. హైదరాబాదులో పుట్టి పెరిగాడు. మూడవ తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబంలో ఇబ్బందుల కారణంగా తన చదువును మధ్యలోనే ఆపేసి ఏదో ఒక పని చేసేవాడు. మొదట్లో ముషీరాబాద్ లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకునేవారు. అనంతరం సినిమాలకు ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరం కావడంతో వెంకట్ కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. 

ఈ క్రమంలోనే చాలామంది ప్రముఖ నటులను సాయం చేయాలని కోరాడు. తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు పవన్ కళ్యాణ్ కలిసినట్లుగా వెంకట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన అనంతరం తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అతను అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలియజేశారు. 


అలాగే తన ఆర్థిక ఇబ్బందులను తెలుసుకొని తన బ్యాంకు ఖాతాలో వెంటనే రెండు లక్షలు జమ చేయించారని వెంకట్ తెలియజేశాడు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియోని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: