మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. అయితే ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తున్న ఈ చిత్రంపై ఆల్రెడీ సాలిడ్ బజ్ నెలకొనగా ఇపుడు ప్రమోషన్స్ లో కూడా మేకర్స్ దూసుకెళ్తున్నారు.
అయితే ఇపుడు ఈ సినిమా ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ జనవరి 6న మేకర్స్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉండే ట్రైలర్ కట్ ని వదలబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా తాను ఇచ్చిన అన్ని పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఇక ఈ అవైటెడ్ సినిమాజనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.ఇదిలావుండగా ఈ సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌', బాలకృష్ణ 'డాకు మహారాజ్‌', వెంకటేష్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ఇప్పటికే ప్రమోషన్స్ హడావిడిని షురూ చేశాయి. అయితే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.


ఒక మంచి ఫ్యామిలీ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని, సంక్రాంతి సీజన్‌కి తగ్గట్టు ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్స్‌, ప్రమోషనల్‌ వీడియోలను చూస్తే అర్థం అవుతోంది. సినిమాకి మినిమం పాజిటివ్ టాక్‌ వచ్చినా ఇతర సినిమాలతో సంబంధం లేకుండా భారీగా వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటి పాటని రమణ గోగులతో పాడించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ పాట కూడా సూపర్‌ హిట్‌ అయింది. రెండో పాటకు సైతం మంచి స్పందన దక్కింది. అందుకే మూడో పాటపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్లాక్‌బస్టర్‌ పొంగల్ అంటూ సాగే ఈ పాటని వెంకటేష్‌తో పాడించారు. ఈ మూడో పాటకి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఫన్నీగా సాగిన ఈ వీడియో పాటపై ఆసక్తిని పెంచుతోంది. అంతే కాకుండా సినిమాని మరోసారి వార్తల్లో నిలిచింది.ఇదిలావుండగా సినిమాలో వెంకటేష్ గెటప్‌తో పాటు హీరోయిన్స్ పాత్రలు సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: