ఈ సినిమా విడుదలై దాదాపు నెల కావస్తున్నా ఇప్పటికీ పుష్ప-2 సినిమాపై ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. థియేటర్లకు వెళ్లి అభిమానులు ఇప్పటికీ సినిమాను చూస్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఉన్న సినీ నటులు పాజిటివ్ గా స్పందించారు. తాజాగా పుష్ప-2 సినిమాపై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్ చేసింది. పుష్ప-2 సినిమాపై ప్రశంసలు కురిపించిన బిజెపి ఎంపీ కంగనా అదే సమయంలో బాలీవుడ్ సినిమాలను ఏకిపారేసింది.
ఇక్కడ రియాలిటీకి చోటు లేదంటూ కంగనా తీవ్ర విమర్శలు చేసింది. హిందీ చిత్ర పరిశ్రమ వాస్తవికతను గ్రహించలేకపోతోంది. అందుకే సౌత్ సినిమాలతో సరిపెట్టుకోలేకపోతోంది. బాలీవుడ్ కు గ్లామర్ పై మోజు ఎక్కువగా పెరుగుతోంది. చాలా మంది హీరోలు, దర్శకులు, హాట్ డేబ్ బీచ్ లు, దర్శకులు, ఐటమ్ నంబర్లను కోరుకుంటున్నారు. వారికి అది మాత్రమే సరిపోతుంది కానీ రియాలిటీ చెక్ చేసుకోవడం లేదు. బాలీవుడ్ నటీనటులు ఒక కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నారు.
దానిని బయటకు తీయడం లేదు అంటూ తనదైన శైలిలో కంగనా విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా పుష్ప టు లాంటి సినిమాలు తీయడం బాలీవుడ్ ఇండస్ట్రీకి చేతకావడం లేదంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. పుష్ప టు లాంటి సినిమాలు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక రేంజ్ కి తీసుకొని వెళ్లాలంటూ సూచనలు చేసింది. కంగనా చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.