గత కొద్ది రోజుల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ విషయం పెద్ద వివాదంగా మారుతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో డిసెంబర్ 4వ తేదీన నిర్వహించారు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద సినిమా చూడడానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అతనిని చూసేందుకు జనం ఎగబడ్డారు. అల్లు అర్జున్ కనిపించడంతో అతడిని దగ్గర నుంచి చూడాలని అభిమానులు ఒకరిపై ఒకరు తొక్కిసలాట చేసుకున్నారు.


ఇందులో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. ఈ కేసు పైన అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటికి తిరిగివచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్లీ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రావడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో సిని ప్రముఖులు అందరూ అతనికి అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నారు.


తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఇదే విషయం పైన జానీ మాస్టర్ స్పందిస్తూ కొన్ని కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే మొదట అతని పిల్లలే నాకు గుర్తుకు వచ్చారని జానీ మాస్టరు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మన శత్రువులైనా సరే జైలును అస్సలు చూడకూడదు, వెళ్ళకూడదు. బన్నీ అరెస్ట్ విషయం విన్న వెంటనే నేను చాలా సంతోష పడినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ క్రియేట్ చేశారు.


వాటిని చూసి చాలా బాధ అనిపించింది. నిజం చెబుతున్నా ఆయన అరెస్ట్ అని తెలిసిన వెంటనే మొదట ఆయన పిల్లలే గుర్తుకు వచ్చారంటూ జానీ మాస్టర్ వెల్లడించాడు. కాగా జానీ మాస్టర్ గత కొన్ని రోజుల క్రితం తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి అని అమ్మాయిపై లైంగికంగా వేధించాడనే విషయం మీద జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ విషయం కారణంగా పుష్పటు సినిమా నుంచి జానీ మాస్టర్ ను తొలగించారు. జానీ మాస్టర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. కానీ ఈ గొడవ కారణంగా అవార్డును రిజెక్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: