అయితే ఇటీవలే జబర్దస్త్ కామెడీ షో లో సన్నీ జీవితంలో జరిగిన ఒక విషాద విషయాన్ని తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. సన్నీకి ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయి కానీ ఒక అమ్మాయి కోసం తన లైఫ్ని వదిలేసుకున్నాడని తెలియజేశారు. ఇప్పటికీ ఆమెను తలుచుకుంటూ బతికేస్తున్నారని అందుకే ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదని తెలియజేయడం జరిగింది.తాజాగా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ లో ఈ విషయాన్ని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతోనే తనకి నమ్మకం పోయిందని అందుకే ఇలా ఒంటరిగా గడిపేస్తున్నారని తెలిపారు.
రష్మి జబర్దస్త్ ఎపిసోడ్ లో సన్నీ గురించి అడిగినప్పుడు ఒక అమ్మాయిని ఎనిమిదేళ్లపాటు ప్రేమించాను ఆమె కూడా ప్రేమించింది కానీ ఆ అమ్మాయి తనని వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుందని అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడిని పెళ్లి చేసుకుందని తెలిపారు. సన్నీ కూడా బాగానే సంపాదించారని కానీ తన లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల లైఫ్నే వదిలేసుకున్నాడంటూ తెలిపారు మరొక కమెడియన్ రాంప్రసాద్. అలాగే తన అన్న వదిన ఇద్దరు కూడా వైద్యులే అని.. అలా తనకి ఎంతో డబ్బులు ఉన్నప్పటికీ తమ రూమ్ కి వచ్చి మరి తమతో కలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడని అమ్మాయి కోసం వాడు లైఫ్నే వదిలేశాడని విషయాన్ని తెలిపారు రాంప్రసాద్.