అనంతరం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు అని తెలిసి బోలెడన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. రాజమౌళి సినిమా కాబట్టి ఎలా అయినా సక్సెస్ అవుతుందని ఆశతో ఉన్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించనున్నారు.
రెండు భాగాలుగా ఈ సినిమాను జక్కన్న తీయబోతున్నారట. ప్రొడక్షన్ లోకి వెళ్లిన అనంతరం ఇంకా బడ్జెట్ పెరగవచ్చని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఓ భాగం కాబోతుందని సమాచారం అందుతోంది. మహేష్ బాబుకి ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇవ్వడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నారట. కానీ మహేష్ బాబు మాత్రం ఈ రెండు సినిమాల పార్ట్స్ కి కూడా అస్సలు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే చేయబోతున్నాడట.
1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా రెమ్యూనరేషన్ బదులు లాభాల్లో వాటా తీసుకుంటానని మహేష్ బాబు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. రాజమౌళి కూడా రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటాలను తీసుకోబోతున్నారట. లాభాల్లో 25% వాట మహేష్ బాబు, రాజమౌళికి ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. దీంతో వీరి రెమ్యూనరేషన్ కూడా మూవీ కోసమే ఖర్చు చేయబోతున్నారట.