అయితే ఆ పిటిషన్ ని సైతం హైకోర్టు స్వీకరించి విచారణ కోసం స్టే కోరడం జరిగింది. దీంతో AI అనుమతిస్తూ న్యాయస్థానం కూడా విచారణ జరిపించి ఒక స్టేని ఇచ్చిందట. అయితే గత ఏడాది బెంగళూరు రెవ్ పార్టీలో చాలా మంది తెలుగు వారందరూ పాల్గొన్నప్పటికీ వారందరికీ కూడా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఈ విషయం కలకలాన్ని సృష్టించింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమ తో పాటుగా ఆషిరాయ్ వెళ్ళగా ఈ పార్టీని వాసు అనే వ్యక్తి నిర్వహించారట. హేమాతో పాటు చాలామంది తెలుగువారు ఉన్నారని రూమర్స్ కూడా వినిపించాయి.
దీంతో తాను రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ హేమ ఒక వీడియోని విడుదల చేయడంతో ఈమె ఫోటోలు సైతం బెంగళూరు పోలీసులు కూడా విడుదల చేశారు .అయితే ఈమె అక్కడ కృష్ణవేణి అనే పేరుతో హేమ పార్టీకి హాజరైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా తమ రికార్డులలో హేమా పేరుని కృష్ణవేణిగా నమోదు చేశారంటూ కూడా ఆమె పైన చార్జి సీటు దాఖలు చేయడం జరిగింది.ఈ క్రమంలోనే ఆమె పైన కేసు కొట్టేయాలని బెంగళూరు హైకోర్టును కూడా హేమ ఆశ్రయించగా గురువారం న్యాయస్థానం స్టే విధించడంతో కొంతమేరకు కేసులో హేమ కి ఊరట లభించిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో నటి హేమకు కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు..