టైం బాగోలేకపోతే ఏదైనా జరగొచ్చు .. సైలెంట్ గా రోడ్డు పక్కన పోతున్న..దారిన పోయే పిచ్చోడు మన చెంప చెల్లుమనిపిస్తాడు. ఇలాంటి సామెతలు మనం ఎన్నెన్నో విని ఉంటాం.  అయితే ఇప్పుడు తమన్నా పరిస్థితి అలాగే దాపురించింది అంటున్నారు జనాలు . తమన్న వ్యక్తిగతంగా ఏ విధంగా కూడా ఆమెను నెగిటివ్ పాయింట్ చూపించడానికి లేదు . చాలా అందంగా ఉంటుంది . చాలా చక్కగా బిహేవ్ చేస్తుంది.  మరీ ముఖ్యంగా డైరెక్టర్స్ అడిగిన వాటికి నో .. కాదు.. కూడదు అనేటివే చెప్పదు, రెమ్యూనరేషన్ ఇస్తే ఎలాంటి సీన్స్ లో అయినా నటిస్తుంది .


ఎలాంటి పనులు చేయమన్నా చేస్తుంది అంటూ కూసింత బోల్డ్ గా నే స్పందిస్తూ ఉంటారు జనాలు . అయితే నటుడు విజయ్ వర్మతో తమన్న డేటింగ్ చేస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు . వీళ్ళు ఏం చేస్తున్నారు ..? ఎక్కడికి వెళ్తున్నారు..? అన్న విషయాలు అందరికీ తెలిసిన పుస్తకమే . అయితే రీసెంట్గా మిల్కీ బ్యూటీ తమన్న బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కి సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ గా మారిపోయింది. విజయవర్మకు ఓ జబ్బు ఉందట . హైలెట్ ఏంటంటే ఈ విషయాని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.



ఈ విషయాన్ని స్వయానా ఆయన బయట పెట్టాడు . ఆయనకు అనారోగ్య సమస్య ఉంది అన్న విషయాన్ని బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఒకానొక ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ .."నాకు అరుదైన చర్మ వ్యాధి ఉంది అని.. ఆ సమస్యతో బాధపడుతున్నాను అని .. మేకప్ కాస్మెటిక్స్ తో దీన్ని కవర్ చేస్తున్నాను" అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు . సాధారణంగా ఏ సెలబ్రెటీ కూడా తమకు ఇలాంటి జబ్బు ఉంది అన్న విషయాన్ని బయటపెట్టారు . మరీ ముఖ్యంగా స్కిన్ కి సంబంధించిన డిసీస్ గురించి బయట పెట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపరు. అయితే విజయ్ వర్మ మాత్రం ఈ విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు . దీంతో తమన్నా బాయ్ ఫ్రెండ్ జబ్బుకు సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది. కొంతమంది ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఏ మగాడికి రాకూడని బాధే వచ్చిందే నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: