అల్లు అర్జున్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో పుష్ప 2 సినిమా చూసి అర్ధమవుతుంది.ఇక అల్లు అర్జున్ కి నెక్స్ట్ చేసే సినిమాలన్నీ పెద్ద సవాళ్లతో కూడుకున్న పని.. ఎందుకంటే ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా పుష్ప -2 సినిమా రేంజ్ లో ఉండాలి. లేకపోతే ఆ సినిమాను చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు.అందుకే బన్నీ తాను నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్లందరిని పెద్దపెద్ద వారినే ఎంచుకున్నారు.అలా ప్రస్తుతం అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా,త్రివిక్రమ్,అట్లీ వంటి డైరెక్టర్లతో సినిమాలు చేయబోతున్నట్టు ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సంవత్సరం అల్లు అర్జున్ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్తాయని తెలుస్తోంది. ఒకటి త్రివిక్రమ్ మరొకటి సందీప్ రెడ్డి వంగాకి సంబంధించిన సినిమా అని సమాచారం. 

అయితే సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ని చాలా డిఫరెంట్ రోల్ లో చూపించబోతున్నట్టు సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే..సందీప్ రెడ్డి వంగా తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలో చాలా వైల్డ్ నెస్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ ని కూడా చూపిస్తారు.అలా ఇప్పటికే ఆయన చేసిన అర్జున్ రెడ్డి,అనిమల్ మూవీస్ ని చూస్తే అందరికీ అర్థమవుతుంది.ఈ రెండు సినిమాల్లో కూడా హీరోలలో రొమాంటిక్ యాంగిల్ తో పాటు వైల్డ్ యాంగిల్ ని కూడా బయటపెట్టారు. ఇక 2023లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగా హీరో క్యారెక్టర్ ని ఎలా తీర్చిదిద్దారో చెప్పనక్కర్లేదు.అయితే ప్రస్తుతం సందీప్  రెడ్డి వంగా ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.

ఇక ప్రభాస్ తో స్పిరిట్ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ ఏడాది ఈ సినిమా పట్టాలేకబోతున్నట్టు సమాచారం.అలాగే అల్లు అర్జున్ తో కూడా ఈ ఏడాది సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ ని ఇప్పటివరకు చూడని పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపిస్తారట. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ని బట్టలు విప్పించి న్యూడ్ గా ఓ సీన్ చేయించాలి అని సదీప్ రెడ్డి వంగా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి న్యూడ్ సన్నివేశంలో నటించడానికి అల్లు అర్జున్ ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.ఇక సందీప్ రెడ్డి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో యానిమల్ మూవీలో రష్మిక ని అలాగే రన్బీర్ ని ఏ విధంగా చూపించారో చెప్పనక్కర్లేదు.అందుకే ఈయన సినిమాలో నటించడానికి కొంతమంది హీరోయిన్ లు కూడా భయపడుతుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: