సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పొలిటికల్ రంగంగా ఇప్పుడు అల్లు అర్జున్ పేరు బాగా ట్రోలింగ్ కి గురవుతుంది. అది ఎందుకో కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే అల్లు అర్జున్ పేరు చెప్పుకొని కొంతమంది తమ సినిమాకి పబ్లిసిటీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు బన్నీ అభిమానులు . మరి కొంతమంది మాత్రం అల్లు అర్జున్ పై కావాలని నిందలు వేసి ఆయన పేరుని ట్రోల్లింగ్ కి గురయ్యాలా చేస్తున్నారు అని .. తద్వారా వాళ్ళ పబ్లిసిటీ పాపులారిటీ కూడా పెంచుకోవడానికి కొందరు చిల్లర వేషాలు వేస్తూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు .


అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ అరెస్టుపై రామ్ చరణ్ ఇప్పటివరకు స్పందించలేదు . పుష్ప2 సినిమా హిట్ పై కూడా స్పందించలేదు . అసలు ఆ మాటకొస్తే పుష్ప2 సినిమా గురించి .. ఆయన ఏ ఈవెంట్లోను ప్రస్తావించలేదు . గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ని పొగుడుతూ పుష్ప2 అన్న పదం ఆయన నోటి నుంచి వచ్చిందే తప్పిస్తే మిగతా కారణంగా పుష్ప సినిమాను అసలు పట్టించుకోనే లేదు .



అయితే అల్లు అర్జున్ అరెస్టుపై అన్ స్టాపబుల్ షో లో రామ్ చరణ్ స్పందించినట్లు ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అన్ స్టాపబుల్ షో కి గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం గెస్ట్ గా వచ్చాడు రామ్ చరణ్ . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది..? అసలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎక్కడ చెడ్డింది..? అనే విషయాలను రామ్ చరణ్ ని అడిగి తెలుసుకున్నట్లు బయటకు వచ్చింది . అంతేకాదు ఫర్ ద ఫస్ట్ టైం రాంచరణ్ తన లవ్ విషయాని కూడా బయటపెట్టినట్లు కూడా తెలుస్తుంది .



"ఒట్టేసిచెబుతున్నా సార్.." అంటూ ఉపాసనకు సంబంధించి ఒక టాప్ సీక్రెట్ ని కూడా రివీల్ చేశారట. అంతేకాదు అన్ స్టాపబుల్ షో లో బన్నీ గురించి ప్రశ్నించగా బాలయ్య ప్రశ్నకు సూటిగా ఆన్సర్ ఇచ్చారట రామ్ చరణ్ . "అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి .. అల్లు అర్జున్ బిహేవియర్ గురించి ..అసలు సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలలో ఎవరిది తప్పు..? అన్న విషయం గురించి పరోక్షకంగానే రామ్ చరణ్ స్పందించాడు అన్న న్యూస్ బయటకు వచ్చింది . రీసెంట్ గానే ఈ  ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది . దీంతో ఈ షూటింగ్ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వార్త బయటకు వస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: