మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజ‌ర్. ఈ సినిమా ట్రైలర్ తాజా విడుదలైంది. దర్శకదీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సినిమా ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలకు ట్రైలర్ ద్వారా శంకర్ సమాధానం ఇచ్చాడు. సినిమా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన పొలిటికల్ డ్రామా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో స్టూడెంట్ నుండి ఐఏఎస్ అధికారిగా ఎలా ఎదుగుతాడు అనే దానిపై స్పష్టత వచ్చింది. అదేవిధంగా హీరో తండ్రి అప్పన్న పాత్రలోనూ చరణ్ అద్భుతంగా నటించాడు. 

100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే వచ్చే నష్టం ఏమీ లేదు.. కానీ ఒక్క ముద్ద లక్ష చీమలకు ఆహారం.. నేను అడిగేది ఆ ఒక్క ముద్దే అంటూ హీరో చెప్పే డైలాగులు ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐఏఎస్ పాత్ర‌తో పాటూ తండ్రి అప్ప‌న్న లుక్ కు కూడా చ‌ర‌ణ్ ఆప్ట్ అయ్యాడు. హెలికాప్టర్ నుండి రామ్ చరణ్ దిగే సీన్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. గతంలో శంకర్ పొలిటికల్ డ్రామాలు సెంటిమెంట్ సినిమాలు, రోబో లాంటి డిఫరెంట్ చిత్రాలు చేసినప్పటికీ గేమ్ చేంజర్ ట్రైలర్ అందుకు భిన్నంగా ఉంది. ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా మాస్ ఎలిమెంట్ తో పాటు కామెడీ, హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఈ చిత్రంలో చరణ్ కు జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించగా, ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న పాత్రకు అంజలి హీరోయిన్ గా నటించింది. చిత్రంలో విలన్ గా ఎస్ జే సూర్య మరియు శ్రీకాంత్ నటించారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించగా నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. టైలర్ తో అంచనాలను పెంచేసిన గేమ్ చేంజర్ ఈ నెల 10న ప్రేక్షకులకు ముందుకు వ‌స్తున్నాడు. మరి ఆ అంచనాలను రీచ్ అవుతుందా చెర్రీ సంక్రాంతి గేమ్ చేంజ‌ర్ అవుతాడా అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: