పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మైత్రి మూవీస్ భాగస్వామి .. ఇక ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాని పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు .. అక్కడ ఎన్నో అవార్డులని ఈ సినిమా గెలుచుకుంది .. ఉత్తమ బాలనటిగా కొన్ని పురస్కారాన్ని సుకృతి సొంతం చేసుకుంది .. గాంధీజీ ఆదర్శలను పాటిస్తూ 13 ఏళ్ల అమ్మాయి తన పుట్టిన ఊరు కోసం ఏం చేసిందన్నదే ఈ సినిమా స్టోరీ .. ఇక సోషల్ మీడియా సమాజాన్ని ఎలా బ్రష్టు పట్టిస్తుందో అందులో నుంచి బయట పడాలంటే ఏం చేయాలో కూడా ఈ సినిమా చెప్పనుంది ..
ఇక సుకుమార్ సహాయ సహకారాలు ఈ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి .. మైత్రి మూవీస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది .. అలాగే ప్రమోషన్స్‌కు కూడా ఏం డోకా లేదు .. అవార్డులు కోసం ఇలాంటి సినిమాలు తీసిన వాటికి థియేట్రికల్ రిలీజ్ కల్పించడం మామూలు విషయం కాదు .. ఓ నిర్మాతగా తండ్రిగా సుకుమార్ కు ఈ సినిమా ఎంతో స్పెషల్ .. ఇక రీసెంట్ గా సుకుమార్ కూడా ఈ సినిమాను చూశారు .. అలాగే తండ్రిగా దర్శకుడుగా తన కూతురిని నటన మెచ్చుకున్నారు .. అలాగే త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా సుకుమార్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి .