ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్లు మాత్రమే ఉండేవి .. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది .  సినిమా ప్రమోషన్ కొత్త పొంతలు తొక్కుతుంది.   సోషల్ మీడియా రాక‌తో డిజిటల్ ప్రమోషన్ లో కొత్త ట్రెండ్స్‌ ఎప్పటికప్పుడు వస్తున్నాయి .  అలాగే ఇవి చాలదన్నట్టు ప్రజెంట్ ప్రమోషన్ కు రియాల్టీ షోలను కూడా గట్టిగా వాడేస్తున్నారు చిత్ర యూనిట్లు .. ప్రధానంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ ప్రమోషనల్ ట్రెండ్ గట్టిగా వర్కౌట్ అవుతుంది. ఇక ఇప్పుడు సంక్రాంతికి తెలుగు నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా .  గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం .. ఈ మూడు సినిమాలు సంక్రాంతి వార్‌లో ఉన్నాయి .. అలాగే ఈ మూడు కూడా డిఫరెంట్ జానర్లు .. అలాగే ఈ మూడు సినిమాల్లోనూ డిఫరెంట్ ఇమేజ్ ఉన్న అగ్ర హీరోలు నటించారు ..


 అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్స్ స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం మూడు సినిమాలు ఒకే ఫార్ములా ను రిపీట్ చేశాయి .. అదే రియాల్టీ షో ప్రమోషన్ .. ఈ మూడు సినిమాల చిత్ర యూనిట్ తమ మూవీని ఆహా అన్‌స్టాపబుల్ షోలో  ప్రమోట్ చేశాయి . ఇక తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ షో షూటింగ్లో పాల్గొన్నారు .  గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా బాలయ్య షోకు వచ్చిన చరణ్ కు ఘ‌న‌ స్వాగతం పలికారు .. అలాగే మనిద్దరి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు నట‌సింహం .. అలాగే ఈ వారం బాలయ్య‌ హీరో గా తెర్కక్కిన డాకు మహారాజ్ మూవీ టీం ఈ షోలో సందడి చేయనుంది .. అలాగే ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్లో టాప్  ట్రెండ్ గ్‌ లో ఉంది. ఇక పూర్తి ఎపిసోడ్ జనవరి 3 సాయంత్రం ఏడు గంటలకు ప్రేక్షకులు ముందుకు రానుంది.


ఇక సంక్రాంతి వార్‌లో దిగుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .  ఇప్పటికే ఈ సినిమా టీం తో అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ ప్రేక్షకులను గట్టిగా అలరించింది. బాలయ్య , వెంకీ సందడి అందరినీ ఆకట్టుకుంది .. ఇక‌ ఈ రీసెంట్ టైమ్స్‌ లో బిగ్‌ బాస్‌ లోనూ రిలీజ్ మూవీస్‌ టీమ్‌ సందడి చేసిన  సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక సౌత్‌ లో మాత్రమే కాదు నార్త్‌ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. త్రిబుల్ ఆర్ రిలీజ్ టైం లో దాదాపు అన్ని నార్త్ రియాల్టీ షోస్ లో తమ సినిమాను ప్రమోట్ చేశారు ఎన్టీఆర్ , రామ్ చరణ్, బాలీవుడ్ బిగ్ బాస్ , ది కపిల్ శర్మ షోలాంటి ఈవెంట్స్ లో సినిమా ప్రమోషన్స్ రెగ్యులర్ గా కనిపిస్తాయి. అలాగే ఈ విధంగా ప్రమోట్ చేసిన సినిమాల రిజల్ట్స్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. ప్రజెంట్ ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఇదే కొత్త ట్రెండ్గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: