గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఇదే క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ , బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వెళ్లారు .. అలాగే ఇదే సమయంలో తన మనసులోని కోరిక బయటపెట్టి అసలు విషయాని చెప్పటంతో ఇద్దరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు .. మరి అసలేం జరిగింది బాలయ్య షోలో గ్లోబల్ స్టార్ ఏం చెప్పాడు అనేది ఇక్కడ తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వచ్చిన మూవీ త్రిబుల్ ఆర్ .. 2021 లో విడుదైన ఈ సినిమా ఘనవిజయం అందుకుంది .. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.


ఇక ఈ సినిమాకి ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ మంచి స్నేహితులు ఆ స్నేహం ఈ సినిమాకి మరింత కలిసి వచ్చింది .. ఇక ఎవరి పాత్ర ఎక్కువ ? ఎవరి పాత్ర తక్కువ ? అనే చర్చ కూడా ప్రధానంగా నడిచిన ఇద్దరు హీరోలు కి రోల్ పోషించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . అలాగే నటన కూడా ఎవరికి వారు బెస్ట్ అనే విధంగా ప్రేక్షకులను మెప్పించారు . అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో రామ్ చరణ్ మల్టీ స్టార‌ర్ కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని దర్శకుడు అట్లీ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి .. ఇక దీంతో మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు నిజమవుతుంది అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో మల్టీస్టారర్ పై క్రేజీ వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది .. అదే రామ్ చరణ్ , మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తున్నట్లు. అయితే ఈ విషయాన్ని చెప్పింది మరి ఎవరో కాదు స్వయంగా రామ్ చరణ్ ని చెప్పకొచ్చారు ..


మంగళవారం జరిగిన అన్ స్టాపబుల్ సీజన్4 ఎనిమిదవ ఎపిసోడ్ షూటింగ్లో భాగంగా బాలయ్యతో మాట్లాడుతూ చరణ్‌ ఇలాంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారట .. తాను కోరుకుంటున్న మల్టీస్టారర్ మూవీ ఇదేనని మహేష్ బాబుతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలనేది తన కోరిక అని రాంచరణ్ చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు , రామ్ చరణ్ , ఎన్టీఆర్ ముగ్గురు మంచి స్నేహితులు .. ఈ ముగ్గురు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే కలుసుకుంటారు.. ఈ క్రమంలోని వీరీ మధ్య మంచి ర్యాప్బో కూడా ఉంది .. అలాగే స్నేహం చనువు కూడా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి కోరికను రామ్ చరణ్ బయటపెట్టారు. ఇక మరి ఇది వర్కౌట్ అవుతుందా అనేది విషయం పక్కనపడితే ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం మహేష్ రాజమౌళితో తన 29వ సినిమా చేయబోతున్నాడు. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాను ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: