అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కావాలంటే చాలా సమయం ఆగాల్సిందే .. రాజమౌళి సినిమా పర్ఫెక్ట్ గా రావటం కోసం ఏళ్ల తరబడి సినిమాలను ఎలా చెక్కుతారో ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గురించి .. పుష్ప 2 మూవీతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అల్లు అర్జున్ .. తన తర్వాత మూవీ ని ఇంకా ఎవరితోనో అనౌన్స్ చేయలేదు .. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తర్వాత మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న వివాదాలు కారణంగా అల్లు అర్జున్ కనీసం పుష్పా2 సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు .. ఇక మరి వెంటనే తర్వాత మూవీకి ఆయన సిద్ధమవుతారా ? లేదంటే మరింత సమయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి . ఒకవేళ ఇప్పుడే అయిన సినిమాను మొదలుపెట్టిన అది ఈ సంవత్సరం మాత్రం రిలీజ్ అయ్యే అవకాశం లేదు ..
ఇలా మహేష్ బాబు అభిమానులతో పాటు అల్లుఅర్జున్ అభిమానులకు కూడా ఈ సంవత్సరం నిరాశే . అలాగే ఇదే లిస్టులో ఉన్న మరో హీరో ఎన్టీఆర్ .. ఈయన డైరెక్ట్ గా వార్2 అనే హిందీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే .. అయితే ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కానుంది కానీ ఎన్టీఆర్ డైరెక్ట్ తెలుగు మూవీ మాత్రం ఈ యాడాది లేకపోవడం గమనార్హం. ఇక ఈ 2025లో సందడి చేయబోతున్న సీనియర్ హీరోల్లో బాలకృష్ణ , వెంకటేష్ , చిరంజీవి ముందున్నారు .. డాకు మహారాజ్ , అఖండ 2 సినిమాలతో బాలయ్య ఫుల్ జోష్లో ఉన్నారు .. సంక్రాంతి వస్తున్నాం సినిమాతో ఈ సంక్రాంతికి వెంకీ మామ సందడి చేయబోతున్నారు . అలాగే చిరంజీవి విశ్వంభరతో , సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీతో, కమలహాసన్ ‘థగ్ లైఫ్’, ధనుష్ , నాగార్జున కుబేర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.