తేజ సజ్జ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అతి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాలో తేజ హీరోగా నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ వంటి ఇతర ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు. 

ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నిరంజన్ రెడ్డికి నిర్మాతగా హనుమాన్ సినిమా మొదటి సినిమా అయినప్పటికీ హనుమాన్ సినిమా విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా నిర్మించారు. తేజ సజ్జ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా హనుమాన్. అతి తక్కువ బడ్జెట్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది.


2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా 275 కోట్ల గ్రాస్, 140 కోట్ల షేర్ వసూళ్లను నమోదు చేసుకుంది. హనుమాన్ సినిమాను రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. తియేట్రికల్ బిజినెస్ సుమారుగా 28 కోట్ల రూపాయల మేర జరిగింది.

సినిమా ఇప్పటికే 110 కోట్లకు పైగా లాభాలను వసూలు చేసింది. హనుమాన్ సినిమాకు గౌర హరి, కృష్ణ సౌరబ్ సురంపల్లి, అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఈ సినిమాతో తేజ సజ్జ మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అభిమానుల మనసులను దోచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: