ఇప్పుడు వీరందరి దారిలోనే మరొక యాంకర్ అడుగులు వేయబోతోంది. ఆమె ఎవరో కాదు యాంకర్ ఉదయభాను.. బుల్లితెరపై ఒకప్పుడు టాప్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఉదయభాను తన అందం మాటలతో అందరిని ఆకట్టుకుంది. కానీ ఈమధ్య ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ అవకాశాల కోసం కొన్ని రకాల ప్రయత్నాలను చేస్తూ ఉన్నది. ఉదయభాను సినిమాలను నటించడం ఎప్పుడో మొదలుపెట్టిన కానీ ఇంతవరకు ఆమెకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
చివరిగా 2013లో మధుమతి అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన ఉదయభాను ఆ తర్వాత కనిపించలేదు. మళ్లీ 2024లో నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 చిత్రంలో కనిపించింది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం ఇమే ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో సినిమాలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ సినిమా బార్బరిక్.. సత్యరాజ్ లీడ్ రోల్లో నటించబోతున్నారట. ఈ చిత్రాన్ని మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. ఇందులో ఉదయభాను విలన్ గా నటిస్తోంది. ఈ సినిమా విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా స్టైల్ లో భారీ ట్విస్టులతో పాటు థ్రిల్లింగ్ ఎలివేషన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయట. మరి యాంకర్ గా నటిగా ప్రయత్నం చేసిన ఉదయభాను ఇప్పుడు విలన్ గా కొత్త అడుగులు వెయ్యబోతోంది.మరి ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి.