తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు. వారందరిలో చాలా స్పెషల్ గా  క్రియేట్ అయిన హీరో రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా, ఇండస్ట్రీకి వచ్చి ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి రామ్ చరణ్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అదే రేంజ్ లో   గేమ్ చేంజర్ అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నారు. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ  జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పొలిటికల్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా  రాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాని జనవరి 10వ తేదీన గ్రాండ్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా  ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పడ్డారు మూవీ యూనిట్. అంతేకాదు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడంతో  అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇదంతా పక్కన  బెడితే ఈ సినిమాలో ముందుగా రామ్ చరణ్ హీరో అనుకోలేదట. ముందుగా ఈ సినిమా కథను కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి దళపతి విజయ్ దగ్గరికి  తీసుకెళ్లారట డైరెక్టర్ శంకర్. అయితే ఈ సినిమాలో  ద్విపాత్రాభినయం ఉంటుంది కాబట్టి దళపతి విజయ్  రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
 ఈ మధ్యకాలంలోనే విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ రిలీజ్ అయిన విషయం తెలుసు. ఇందులో కూడా దళపతి విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. కాబట్టి ఈ సినిమా తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుంది కాబట్టి రెండు ఒకే కోణంలో చేస్తే ప్రేక్షకులు ఆదరించరని చెప్పి ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో నేరుగా ఈ కథ రామ్ చరణ్ వద్దకు చేరిందట. చూడాలి ఈ సినిమా రామ్ చరణ్ కు ఎలాంటి హిట్ ఇస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: