ఈసారి సంక్రాంతి పండక్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదల కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరి ఈ రెండు సినిమాల టికెట్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో ఏ స్థాయిలో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

గేమ్ చేంజర్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి సినిమాల్లో అన్ని సినిమాల కంటే ముందు విడుదల కానుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన నార్త్ అమెరికా టికెట్ బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ 395 లొకేషన్ లలో ఓపెన్ కాగా 1130 పైగా షోలలో ఈ సినిమా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటివరకు ఈ సినిమాకు 380 కే డాలర్స్ కలెక్షన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో విడుదల అయిన పాన్ ఇండియా మూవీలకు వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే నార్త్ అమెరికాలో ఈ సినిమాకు తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

కానీ ఈ సినిమా విడుదలకు మరో వారం రోజులు మిగిలి ఉండడంతో ఆ రోజుల్లో ఈ సినిమాకు బుకింగ్స్ భారీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ 125 పైగా లొకేషన్ లలో , 340 కి పైగా షోలకు కాను , 92 కే డాలర్స్ మార్కును క్రాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ విడుదలకు దాదాపు పది రోజులు ఉంది. మరి ఈ సినిమా ఆ పది రోజుల్లో నార్త్ అమెరికాలో ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: