టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే పవన్ "జనసేన" అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. ఇకపోతే 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ , తెలుగు దేశం , బి జె పి తో పొత్తుల భాగంగా పోటీ చేసింది. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీ చాలా అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా గెలుపొందింది.

అలా జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి తో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులను అప్పజెప్పారు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ సభలో భాగంగా మాట్లాడుతూ తనకు పుస్తకాలు అంటే ఎంత ఇష్టం అనే విషయాన్ని తెలియజేశాడు. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం తొలిప్రేమ అనే సినిమాలో నటించాను. ఆ మూవీ ద్వారా నాకు 15 లక్షల వరకు పారితోషకం వచ్చింది. నాకు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టం. నేను ఆ పదిహేను లక్షలను పట్టుకొని ఓ బుక్ షాప్ లోకి వెళ్లాను. ఆ బుక్ షాప్ లోకి వెళ్ళాక నాకు చాలా గొప్పగా అనిపించింది. నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది.

ఎదురుగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. నేను నాకు నచ్చన పుస్తకాన్ని కొనుక్కున్నాను. దాదాపు నేను కొనుక్కున్న పుస్తకాలకు లక్షన్నర ఖర్చు అయ్యింది. ఆ పుస్తకాలన్నీటిని ఇంటికి తీసుకువెళ్లాను. నా రూమ్ లో పెట్టుకున్నాను. వాటన్నింటిని చూస్తూ నచ్చిన పుస్తకాలను చదువుతూ మూడు రోజుల పాటు నిద్ర లేకుండా సంతోషంగా గడిపాను. అలా నేను తొలిప్రేమ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో నేను అనేక పుస్తకాలను కొని వాటి ద్వారా ఎంతో సంతోష పడ్డాను అని పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: