మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ లో చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. దానితో ఈయన సోలో హీరోగా సినిమా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది.

చరణ్ ఆఖరుగా సోలో హీరోగా వచ్చిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఇకపోతే తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. వినయ విధేయ రామ సినిమా తర్వాత చరణ్ సోలో హీరోగా నటించిన మూవీ కావడంతో మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే సెన్సార్ బోర్డు వారు ఈ సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని ఇంటర్వెల్ , క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతం అని , ఈ సన్నివేశాలతోనే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ ట్రాక్ వస్తుంది అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ ని 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: