ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఉండే పోటీ అంతాఇంతా కాదు. 2016 సంవత్సరం సంక్రాంతి రేసులో ఏకంగా నాలుగు సినిమాలు బరిలో నిలిచాయి. డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్నినాయన సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా ఒకేరోజు థియేటర్లలో విడుదల కావడం గమనార్హం.
 
అప్పట్లో సాధారణ టికెట్ రేట్లతోనే ఈ సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. నాన్నకు ప్రేమతో సినిమాకు ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లు దక్కగా మిగతా సినిమాలకు మాత్రం పరిమితంగా స్క్రీన్లు దక్కాయి. డిక్టేటర్ బాలయ్య 99వ సినిమా కావడం గమనార్హం. అయితే డిక్టేటర్ సినిమాపై నాన్నకు ప్రేమతో సినిమ పైచేయి సాధించింది. అయితే 2016 సంక్రాంతి విజేత ఎవరనే ప్రశ్నకు మాత్రం సోగ్గాడే చిన్నినాయన అని చెప్పవచ్చు.
 
బడ్జెట్ కలెక్షన్ల లెక్కల ప్రకారం సోగ్గాడే చిన్నినాయన డిస్ట్రిబ్యూటర్లకు అదిరిపోయే లాభాలను అందించింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత షాకయ్యాయి. ఎక్స్ ప్రెస్ రాజా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. దర్శకుడు మేర్లపాక గాంధీకి ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో కామెడీ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
 
ఈ సినిమాల తర్వాత బాలయ్య, ఎన్టీఆర్ సినిమాల మధ్య క్లాష్ ఉంటుందని చాలాసార్లు ప్రచారం జరిగినా ఆ ప్రచారం మాత్రం నిజం కాలేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఎన్టీఆర్ సినిమాలు మెజారిటీ సందర్భాల్లో నిరాశ పరిచినా కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొట్టాయి. నాన్నకు ప్రేమతో మూవీ ఫుల్ రన్ లో ఏకంగా 54 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
 
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ ఎప్పుడూ ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. సంక్రాంతి సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే థియేటర్లు సైతం కళకళలాడతాయి. 2025 సంక్రాంతి రేసులో మూడు సినిమాలు నిలవగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాయో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: