టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... ఊర్వసి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ మూడు పాటలను , మరికొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను మేకర్స్ అమ్మివేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్ర ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ యొక్క ఆంధ్ర ఏరియా థియేటర్ హక్కులకు దేవర పార్ట్ 1 సినిమా కంటే ఎక్కువ ఫ్రీ రిలీజ్ చేసినట్లు జరిగినట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ కి ఆంధ్ర ఏరియాలో 47 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , డాకు మహారాజ్ సినిమాకు ఏకంగా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు కనుక బ్లాక్ బాస్టర్ టాక్ రానట్లయితే ఆంధ్ర ఏరియాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఆంధ్ర ఏరియాలో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: