ఒక్కడు సినిమాతో మహేష్ బాబు సంక్రాంతికి అదరగొట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఈ సినిమా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ అబ్బాయి చాలా మంచోడు, ఎవరే అతగాడు, పెళ్లాం ఊరెళితే సినిమాలు సైతం అదే సమయంలో రిలీజ్ కాగా పెళ్లాం ఉరెళితే సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అబ్బాయి చాలా మంచోడు, ఎవరే అతగాడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించినా కలెక్షన్ల విషయంలో సత్తా చాటలేదు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా సతం అదే సమయంలో రిలీజ్ కాగా ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది. ఏఎం రత్నం నాగ సినిమాను నిర్మించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ సినిమాలోని ఒక కొంటె పిల్లనే చూశా సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం కొసమెరుపు.
2023 సంక్రాంతి రేస్ తర్వాత మహేష్ బాబు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కడు సినిమా కమర్షియల్ గా సత్తా చాటడంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడం గమనార్హం. సంక్రాంతి అండుగ అంటే పెద్ద సినిమాల మధ్య పోటీ తప్పనిసరి అని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ కావడం గమనార్హం.