టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి ఉన్నంత క్రేజ్ ఏ పండుగకి ఉండదు.... తెలుగు రాష్ట్రాలకు అతి ముఖ్యమైన పండుగ కావడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు.అయితే సంక్రాంతి పండుగ సీజన్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు పండుగ సీజన్ వరకు కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అయితే రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలో  ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన సినిమానే  అసలైన సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్ కి మన టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ మూవీలతో పోటీ పడుతూనే వున్నారు.. అన్ని సంక్రాంతి సీజన్ లు వేరు కానీ 2004 సంక్రాంతి సీజన్ కి మాత్రం ప్రత్యేకత వుంది.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా భావించే ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ ఆ టైం లో యంగ్ హీరోలు…అప్పటి టాప్ హీరోలు అయిన బాలయ్య, చిరంజీవి వరుస సినిమాలతో పోటీ పడేవారు..

కానీ 2004 సంక్రాంతి సీజన్ కి ఆ ఇద్దరి హీరోల భారీ సినిమాలకు ధీటుగా యంగ్ హీరో ప్రభాస్ బరిలోకి దిగాడు..జనవరి 14 2004 న ప్రభాస్ నటించిన ‘వర్షం ‘ సినిమా రిలీజ్ అయింది.. టాప్ ప్రొడ్యూసర్ “ ఎమ్ ఎస్ రాజు ‘’ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ కి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.. ప్రభాస్ కెరీర్ లో వర్షం సినిమా మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో త్రిష గ్లామర్, గోపీచంద్ విలనిజం ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాయి..ఇక అదే రోజు వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ ‘లక్ష్మి నరసింహ’ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమా విక్రమ్ నటించిన తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘సామి’ కి రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్ అయినా సరే పవర్ ఫుల్ డైలాగ్స్ తో బాలయ్య ఎంతగానో ఆకట్టుకున్నాడు..

దర్శకుడు జయంత్ సి పరాంజి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు..మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ఎంతో హైలైట్ గా నిలిచింది. ఇక సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన మరో బిగ్గెస్ట్ మూవీ ‘అంజి’.. మెగాస్టార్ చిరంజీవి, కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ.. జనవరి 15 న రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్ పరంగా అద్భుతంగా వున్నా ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది..దీనితో 2004 సంక్రాంతి సీజన్ అసలైన విన్నర్ గా ప్రభాస్ నిలిచాడు.. వర్షం సినిమాతో ప్రభాస్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ విజయం అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: