రోజా 1972 నవంబరు 17న చిత్తూరు జిల్లా, తిరుపతిలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు నాగరాజురెడ్డి, లలిత. ఈమెకు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాదరెడ్డి అని ఇరువురు సోదరులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా రోజా కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివింది. తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. కొన్ని సంవత్సరాలు, రోజా కూచిపూడి నృత్యాన్ని కూడా అభ్యసించింది. రోజా ప్రముఖ తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమ పెళ్ళిచేసుకుంది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు.
అయితే రోజా లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయంట. ఈమెని పెళ్లి చేసుకోవడం కోసం దాదాపుగా పదేళ్లు సెల్వమణి వెయిట్ చేశారట. సెల్వమణి, రోజా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ.. సెల్వమణి ముందుగా రోజా తల్లిదండ్రుల అంగీకారం తీసుకోని తర్వాత ఆమెకి ప్రపోజ్ చేశారట. అలాగే ఆయన తనకి ఎప్పటివరకు నటించాలని ఉంటే అప్పటివరకు నటిస్తూనే ఉండమని.. దానికి ఎంత సమయం పట్టినా పర్వాలేదని చెప్పారంట. పెళ్లికి రోజా వల్ల ఇంట్లో ఒప్పుకున్నప్పటికి అతను దాదాపుగా పదేళ్లు వేచి చూశాడు అంట. వీరిద్దరి వివాహానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారట.