2010 సంక్రాంతి విన్నర్:
2010 సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.. రవితేజ శంభో శివ శంభో,వెంకటేష్ నమో వెంకటేశాయ, జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్,నవదీప్ కాజల్ అగర్వాల్ కాంబోలో వచ్చిన ఓం శాంతి.. ఈ నాలుగు సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 2010 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ మూవీ నిలిచింది.. వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపత్రాభినయం చేసిన అదుర్స్ మూవీ 2010 జనవరి 13న విడుదలైంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపత్రాభినయంలో చేయగా బ్రాహ్మణ పాత్రలో చేసిన ఎన్టీఆర్ కి నయనతార జోడీగా మరో ఎన్టీఆర్ కి జోడిగా షీలా నటించింది..ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ మీమ్స్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ 2010 బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది.