బిగ్ బాస్ సీజన్ 8 లో విష్ణు ప్రియ, పృథ్వీరాజ్ శెట్టి లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్ లో లవ్ బర్డ్స్ అంటే వీరిద్దరే గుర్తొస్తారు. అయితే ఇంటర్వ్యూలో వీరిద్దరి గురించి అర్జున్ అంబటి మాట్లాడుతూ.. విష్ణు కి పృథ్వీ అంటే ఇష్టమని తానే చెప్పిందని అన్నారు. అది పృథ్వీకి కూడా ఒకే అయితే ముందుకు వెళ్దాం అనుకుందని చెప్పారు. కానీ పృథ్వీ మాత్రం మనం ఫ్రెండ్స్ గానే ఉందాం అని చెప్పడంతో తాను కూడా కామ్ అయిపోయినట్లు అర్జున్ అంబటి తెలిపారు. విష్ణుప్రియ బయట ఎలా మాట్లాడుతుందో.. లోపల కూడా అలాగే మాట్లాడింది అని అన్నారు.  
ఇక బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం విష్ణు, పృథ్వీ పనులు చేయడం. అతని పేరు ఎత్తితే చాలు విష్ణు ప్రియ సిగ్గుపడటం. ఆమె ఆటను కూడా పక్కన పెట్టి పృథ్వీరాజ్ ఆటపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం. నామినేషన్స్ లో కూడా అతనికి వ్యతిరేఖంగా ఉన్నవారిని నామినేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అతను తన డోఫోమైన్ అంటూ కూడా విష్ణు వ్యాఖ్యానించింది. అంతా ఎందుకు వీకెండ్ లో నాగార్జున సైతం వీళ్లిద్దరి గురించి మాట్లాడే విషయాలు కూడా ఎక్కువే. 8వ వారం నామినేషన్స్‌లో కూడా అటు పృథ్వీని ఇటు విష్ణుప్రియను మిగిలిన కంటెస్టెంట్స్ టార్గెట్ చేశారు. 'అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు.. చాలా వారాలుగా మీ గేమ్ కూడా ఏం కనిపించట్లేదు' అంటూ ఒకరి తర్వాత ఒకరు నామినేషన్స్ కూడా వేయడం జరిగింది.
అయితే బిగ్ బాస్ సీజన్ 8 ముగిసిన తర్వాత వీరిద్దరి లవ్ స్టోరీకి కూడా బ్రేక్ పడుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో విష్ణు ప్రియ, పృథ్వీరాజ్ శెట్టి ఫ్యాన్ పేజీ ఒకటి వారిద్దరి వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేయగా.. దానికి విష్ణు ప్రియ వావ్ ఈ ఎడిట్ ఎంత బాగుందని కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎడిట్ ని తన స్టోరీలో కూడా పెట్టుకుంది. ఈ ఎడిట్ చాలా బాగుందని, ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 8 అనేది సినిమా అయితే.. అందులో నేను హీరోయిన్ లాగా ఫీల్ అయ్యేలా మీ ఏడిట్స్ చేస్తున్నాయని ఆమె రాసుకొచ్చింది. అంతే కాదు ఆమె ఆ ఎడిట్ ని హైలైట్ లో కూడా యాడ్ చేసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: