పుష్ప 2 సినిమా విడుదలైనప్పటి నుంచి ఆ సినిమాకి సంబంధించి ఏదో ఒక విషయంలో అటు నిర్మాతలు, అల్లు అర్జున్ రష్మిక విషయంలో ఏదో ఒక న్యూస్ వినిపిస్తోంది ముఖ్యంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అల్లుఅర్జున్ కే కాకుండా నిర్మాతలకు హీరోయిన్ కి కూడా చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇటీవలే అల్లు అర్జున్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్స్ పైన కూడా కేసు నమోదు కావడంతో ఇటీవలే ఈ కేసు పైన తెలంగాణ హైకోర్టు ఊరట కలిగించినట్లు తెలుస్తోంది.



సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నవీన్ పిటిషన్ దాఖలు వేయడం జరిగిందట. సంధ్య థియేటర్ ఘటన పైన తమ మీద నమోదు చేసినటువంటి కేసును సైతం కొట్టివేయాలంటూ ఒక పిటిషన్ కూడా ప్రొడ్యూసర్స్ వేశారట.. ముఖ్యంగా థియేటర్ భద్రత తమ పరిధిలో కాదని పిటీషనర్ న్యాయవాదులు వివరించారు. తమకు బాధ్యత ఉంది కాబట్టే ముందుగానే పోలీసులకు సమాచారం  ఇచ్చామని వెల్లడించారు. సమాచారం ఇచ్చాము కాబట్టి అంతమంది పోలీసు బాలగాలు అక్కడికి వచ్చాయని తెలిపారు ప్రొడ్యూసర్స్ తరఫున న్యాయవాది.


దీంతో ఇలా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని ప్రొడ్యూసర్స్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారట. ఈ జరిగిన సంఘటన సినిమా ప్రొడ్యూసర్లను నిందితులుగా చేరిస్తే ఎలా అంటూ ప్రశ్నించడం జరిగింది దీంతో సినిమా ప్రొడ్యూసర్లను అరెస్టు చేయవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేసిందట. వీటిని కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక తదుపరి విచారణ మరో రెండు వారాల తరువాత వాయిదా వేసినట్లు తెలుస్తోంది హైకోర్టు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే నిర్మాతల పైన ఎలాంటి ఇబ్బందులు ఉండేలా కనిపించడం లేదు. ఈ కేసు కూడా హైకోర్టు లోనే క్లియర్ అయ్యేలా కనిపిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: