సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రానుంది. నేడు నాంపల్లి కోర్టు  బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది. ఇక ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు కూడా ముగిశాయి. ఇటీవల పుష్ప నిర్మాతలకు హై కోర్టు లో ఊరట లభించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నాడు. దీంతో నేడు అల్లు అర్జున్ బెయిల్ పై విచారణ లభిస్తుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఇక ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఆసుపత్రి ICU లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. దీంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‎ను అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే బన్నీ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్‎కు హై కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్ కి మహిళ చనిపోయిందని తెలిసినప్పటికి ఆయన సరైన పద్దతిలో స్పందించలేదని సమాచారం వచ్చింది. ఈ కారణంగా అల్లు అర్జున్ కేసు ఏ మలుపు తీరుగుతోందో చూడాలి మరి.  



మరింత సమాచారం తెలుసుకోండి: